చైనాలో ముగిసిన అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన

ఆరు రోజుల చైనా పర్యటనను ముగించుకొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ సిఛుయాన్ ప్రావిన్స్ రాజధాని ఛెంగ్డూ నుంచి సోమవారం అమెరికాకు పయనమయ్యారు. బిడెన్ తన పర్యటనలో చైనా అధ్యక్షుడు హు జింటావో, ప్రధానమంత్రి వెన్ జియబావో, సీనియర్ లెజిస్లేటర్ వూ బాంగ్యూవోలతో బీజీంగ్‌లో భేటీ అయ్యారు.

చైనా ఉపాధ్యక్షుడు జ్సీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో చర్చలు జరిపిన బిడెన్, ఇద్దరు కలిసి ఒక ఉన్నత పాఠశాలను సందర్శించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. బిడెన్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో విజయవంతమైందదని చైనాలో అమెరికా రాయబారి గ్యారీ లోక్కో వ్యాఖ్యానించారు. చైనా ఉపాధ్యక్షుడి ఆహ్వానం మేరకు బిడెన్ బుధవారం బీజింగ్ చేరుకొన్నారు. పలు ఆర్థిక, అంతర్జాతీయ అంశాల్లో అమెరికా, చైనాల విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో బిడెన్ పర్యటనకు ప్రాధాన్యత లభించింది.

వెబ్దునియా పై చదవండి