చైనా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 16మంది మృతి

చైనాలోని అన్హూయ్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడులో 16 మంది మృతి చెందారు. ఆదివారం జరిగిన ఈ భారీ పేలుడులో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అధికంగా ఉద్యోగులేనని, గాయపడిన వారిని ఫ్యాక్టరీ సమీపంలో నివశించిన వారని స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఈ సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చైనాలో ఉన్న బొగ్గు గనుల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదాల నివారణకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా ప్రమాదాలను మాత్రం నివారించ లేక పోతున్నారు.

వెబ్దునియా పై చదవండి