జాక్సన్ మరో కృత్రిమ అవయవం అదృశ్యం!

ప్రపంచ పాప్ సంగీత రారాజు, దివంగత మైఖేల్ జాక్సన్‌ అమర్చుకున్న కృత్రిమ అవయవాల్లో మరో అవయవం మాయమైంది. అప్పటికే ఆయన మెదడు కనిపించకుండా పోయిందని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా అమర్చుకున్న కృత్రిమ ముక్కు కూడా జాక్సన్ ముక్కు అదృశ్యమైనట్టు వినికిడి. జాక్సన్ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని ఉటంకిస్తూ డైలీ మెయిల్ ఆన్‌లైన్ ఈ కథనాన్ని ప్రచురించింది.

ముక్కు స్థానంలో కేవలం రంధ్రం మాత్రమే ఉందని, దాని చుట్టూత కొంతమేరకు మృదులాస్థి కనిపించిందని ఆ సాక్షి చెప్పాడు. మైకేల్ జాక్సన్ పలు మార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం తెల్సిందే.

దీంతో ముక్కు బాగా దెబ్బతిని దాని స్థానంలో కేవలం రంధ్రం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, జాక్సన్ చేసిన వివిధ రకాల సేవలను ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. పాప సంగీతానికి ఆయన ఎనలేని సేవ, కృషి చేశారని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి