తీవ్రవాదుల అడ్డాగా మారడానికి పాక్ వ్యతిరేకం: ఖర్

తీవ్రవాదులు తమ దేశాన్ని స్థావరంగా వాడుకోవడానికి పాకిస్థాన్‌ వ్యతిరేకమని, ప్రపంచదేశాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్ధం చేసుకోవాలని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ బుధవారం పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాన మద్దతుదారైన చైనాతో సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు రెండు రోజుల బీజింగ్ పర్యటనకు వచ్చిన రబ్బానీ ఖర్ తెలిపారు.

గత నెలలో పశ్చిమ ప్రాంతం జింజియాంగ్‌లో జరిగిన దాడులకు పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన తీవ్రవాదులు కారణమని చైనా అధికారులు ఇటీవల ఆరోపించారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జీఛీ, ప్రధానమంత్రి వెన్ జియాబావోలతో భేటీ అయిన ఖర్ పాకిస్థాన్ తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించిన పాకిస్థాన్ తాలిబాన్, దాని అనుబంధ సంస్థలను ఎదుర్కోవడంలో ఇస్లామాబాద్ మల్లగుల్లాలు పడుతున్నది.

వెబ్దునియా పై చదవండి