దక్షిణాఫ్రికాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదు

దక్షిణాఫ్రికాలో శుక్రవారం తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదయింది. గత కొన్ని నెలలుగా ప్రమాదకర స్వైన్ ఫ్లూ వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకిన కారణంగా వివిధ దేశాల్లో 160 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణాఫ్రికాకు కూడా ఈ వ్యాధి వ్యాపించింది.

అమెరికా నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అధికారిక వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అతను జూన్ 14న దక్షిణాఫ్రికా వచ్చాడు. స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలతో అతను సోమవారం ఆస్పత్రిలో చేరాడు. అతనిపై పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చామని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి