నోబెల్‌కు లభించే మొత్తాన్ని దానం చేస్తా: ఒబామా

FILE
2009వ సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారం సందర్భంగా పొందే 14 లక్షల అమెరికా డాలర్ల రాశిని దానం చేస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి నోబెల్ పురస్కారానికి లభించే 14 లక్షల అమెరికా డాలర్ల రాశిని దానం చేస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ వెల్లడించారు.

తాను పొందే మొత్తం రాశిని ఏ సంస్థకు దానంగా ఇస్తారనేది ఇంకా తెలియరాలేదని ఆయన అన్నారు.

తమ అధ్యక్షుడు దానం చేయాలనుకున్న మొత్తం డబ్బును ఏ సంస్థకు ఇవ్వాలనేదానిపై తాము చర్చలు జరుపుతున్నట్లు గిబ్స్ తెలిపారు. దీనికిగాను సామాజిక కార్యక్రమాలకు ఏయే సంస్థలు బాగా పనిచేస్తున్నాయని తాము విచారణ చేపట్టామన్నారు. నోబెల్ బహుమతిని పొందేందుకు ఒబామా స్వయంగా ఓస్లో వెళ్తారని ఆయన తెలిపారు.

తనకు ఈ పురస్కారం రావడం తన ఒక్కడి కృషి కాదని, ఇందులో ప్రపంచంలోని కొన్ని లక్షలమంది ఆశయాలు కలిసివున్నాయని ఒబామా వెల్లడించినట్లు గిబ్స్ తెలిపారు. ప్రపంచంలో మెరుగైన జీవితాన్ని జీవించేందుకు ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందని, ఇది అలాంటివారికోసమే ఈ బహుమానమని ఒబామా ప్రకటించినట్లు గిబ్స్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి