పరిస్థితి అంచనాకు కరాచీ చేరిన పాక్ ఆర్మీ ఛీఫ్ కయానీ

గురువారం, 25 ఆగస్టు 2011 (12:36 IST)
గత కొన్ని వారాలుగా జరుగుతున్న హింసలో మూడు వందల మంది మరణించిన పాకిస్థాన్ ఆర్ధిక రాజధాని కరాచీలో నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా అంచనావేయడానికి గానూ ఆ దేశ ఆర్మీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ గురువారం కరాచీలో పర్యటిస్తున్నారు. జనరల్ కయానీ గురువారం ఉదయం కరాచీ చేరుకున్నట్లు స్థానిక వార్తా పత్రిక తెలిపింది. నగరంలోని పరిస్థితిని కయానీ సమగ్రంగా సేకరిస్తారని సైనిక వర్గాలు తెలిపాయి.

కయానీ పర్యటనకు రాజకీయ విశ్లేషకులు ప్రాధాన్యత ఇచ్చారని మీడియా వెల్లడించింది. ప్రభుత్వం కోరినట్లయితే కరాచీలో హింసను ఆపడానికి సైన్యం సిద్ధంగా ఉందని కయానీ శనివారం స్పష్టం చేశారు. ఓడరేవు నగరం కరాచీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్మీ ఛీఫ్ జాతిని కాపాడటం సైన్యం బాధ్యతగా పేర్కొన్నారు. కరాచీలో మిలిటరీ ప్రమేయం సాధ్యం కాదని ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ కొట్టిపడేసిన ఒక్కరోజు తర్వాత కయానీ ఈ ప్రకటన చేయడం విశేషం.

వెబ్దునియా పై చదవండి