పర్యాటక వీసాలపై ఆంక్షలు: ప్రవాసీయుల అసంతృప్తి

మంగళవారం, 20 ఏప్రియల్ 2010 (11:36 IST)
పర్యాటక వీసాలు పొందిన వారు రెండు నెలల్లో రెండు సార్లు ఉపయోగించరాదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీని పట్ల మలేషియాతో పాటు.. పలు దేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డేవిడ్ హెడ్లీ తన పర్యాటక వీసాను పలుమార్లు ఉపయోగించి దాడులకు కుట్ర పన్నినట్టు ఇప్పటికే విచారణలో వెల్లడైన విషయం తెల్సిందే.

ఇదే తరహాలో భవిష్యత్‌లో విదేశీయులు దాడులకు కుట్ర పన్నకుండా ఉండేందుకు వీలుగా.. ఈ ఆంక్షలను కేంద్రం విధించింది. పర్యాటక వీసా కలిగిన విదేశీయులు రెండు నెలల్లో రెండు సార్లు భారత్‌కు రావడానికి వీలులేకుండా చేసింది. ఈ నిబంధన గత జనవరి నుంచి అమల్లో ఉన్నప్పటికీ.. ఇక నుంచి మరింత కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది.

మలేషియా జనభాలో ఎనిమిది శాతం మంది ప్రవాస భారతీయులు కాగా, వీరిలో ఏడు శాతం ఒక్క తమిళులు కావడం గమనార్హం. తాజాగా విధించిన వీసా ఆంక్షల వల్ల వీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి