పర్యావరణ పరిరక్షణకు యూకే-ఫ్రాన్స్‌ల భారీ సాయం!

శుక్రవారం, 11 డిశెంబరు 2009 (18:08 IST)
పర్యావరణ పరిరక్షణ, భూతాపంపై ప్రపంచ దేశాలు కళ్లుతెరిచాయి. పర్యావరణ పరిక్షణ, కర్బన ఉద్గరాల విడుదలపై కోపెన్‌హాగెన్‌లో ప్రపంచ దేశాలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, పేద, మధ్యతరగతి దేశాధిపతులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.

సదస్సు అనంతరం ఒక ముసాయిదాను రూపొందించారు. ఈ నేపథ్యంలో.. క్లైమెట్ డీల్‌కు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ వంతు సాయంగా 1.5 బిలియన్ల (జీబీపీ) డాలర్ల మేరకు నిధులసాయాన్ని ప్రకటించాయి. ఈ విషయాన్ని బ్రిటీష్ ప్రధానమంత్రి గార్డెన్ బ్రౌన్ శుక్రవారం ప్రకటించారు.

బ్రస్సెల్స్‌లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ (ఈయూ) సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ చేపట్టేందుకు పేద దేశాలకు ఆరు బిలియన్ ఈయుఆర్‌లను సాయం చేయనున్నట్టు వారు హామీ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ గ్లోబల్ వార్మింగ్ ఫండ్‌కు ఏ మేరకు.. నిధుల సాయం చేయాలనే అంశంపై ఆయా దేశాలు చర్చిస్తున్నాయి.

అలాగే, ఇది మాటల సమయం కాదని, పని చేయాల్సిన తరుణమన్నారు. అయితే, సమస్యను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల మద్దతు ఎంతో అవసరమన్నారు. అయితే, ఇతర యూరోపియన్ దేశాలు ఏ మేరకు నిధుల సాయం చేస్తాయనే అంశం సందిగ్ధంగా ఉంది. నిధుల కేటాయింపే అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఈ సమస్య తీవ్రతను తెలుపుతుందని ఆయన పేర్కన్నారు.

వెబ్దునియా పై చదవండి