పాక్ గిరిజన ప్రాంతంలో శాంతి ఒప్పందం రద్దు

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని తాలిబాన్ తీవ్రవాదులు రద్దు చేశారు. నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పాకిస్థాన్ సైన్యం గత కొన్నివారాలుగా తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. స్వాత్ లోయలో తాలిబాన్ల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పాక్ సైన్యం ఈ చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో తాలిబాన్ వర్గం పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజా దాడులు చేయడతామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే తాలిబాన్లపై చేపట్టిన సైనిక చర్యను చివరి వరకు కొనసాగిస్తామని పాక్ మిలిటరీ స్పష్టం చేసింది. తాజాగా ఉత్తర వజీరిస్థాన్‌లోని తీవ్రవాదులు పాక్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా డ్రోన్ దాడులు, పాక్ సైనిక చర్యలు తొమ్మిది సూత్రాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని తాలిబాన్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఉతమంజై గిరిజన పెద్దలు, పాక్ ప్రభుత్వం మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అయితే తాజాగా దీనిని రద్దు చేసిన తాలిబాన్లు అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి