పాలస్తీనాకు 200 మిలియన్ డాలర్ల సాయం

పాలస్తీనా అధికారిక యంత్రాంగానికి అమెరికా ప్రభుత్వం 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మార్చిలో పాలస్తీనా ఆర్థిక సాయానికి హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన హామీకి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం తాజాగా ఈ ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించింది.

మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా పాలస్తీనా అధికారిక యంత్రాంగానికి అమెరికా ప్రభుత్వం సాయం చేస్తోంది. అంతేకాకుండా సిద్ధాంతపరమైన సంస్కరణలు చేపట్టిన పాలస్తీనాను ప్రోత్సహిస్తామని హిల్లరీ క్లింటన్ గతంలో చెప్పారు. దాతలు ఇచ్చిన నిధులను పారదర్శకంగా ఖర్చు చేసేందుకు పాలస్తీనా యంత్రాంగం ఇప్పుడు వ్యవస్థలు ప్రవేశపెట్టింది.

వెబ్దునియా పై చదవండి