బ్రిటీష్ కౌన్సిల్‌పై దాడిని ఖండించిన హిల్లరీ క్లింటన్

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని బ్రిటీష్ కౌన్సిల్‌పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులు చేసే ఇటువంటి దాడులు ఆఫ్ఘనిస్థాన్‌లో సమస్యల పరిష్కారంపై ప్రభావం చూపలేవని పేర్కొంది. ఈ దాడిలో పదిమంది మరణించారు.

"ఇటువంటి కిరాతక దాడులు ఆఫ్ఘనిస్థాన్, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంలో మా నిబద్ధతను దెబ్బతీయలేవు" అని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆఫ్ఘన్ పౌరులతో పాటు ఆఫ్ఘన్ ప్రభుత్వ, భద్రతా దళాలకు అమెరికా తన మద్దతును కొనసాగిస్తూనే ఉంటుంది, దశాబ్దాలుగా యుద్ధాలను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తుంది అని ఆమె చెప్పారు.

బ్రిటన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా బ్రిటన్ కౌన్సిల్ భవన సముదాయంపై ఆత్మాహుతిదళం శుక్రవారం దాడులు జరిపింది. ఐదుగంటల పాటు అగ్నికీలలు ఎగసిపడిన ఈ ఘటనలో పదిమంది చనిపోయారు.

వెబ్దునియా పై చదవండి