ఒమన్ తీరంలో భారతీయ నౌకను సోమాలియా పైరేట్లు హైజాక్ చేశారు. ఈ చమురు ఓడలో ఉన్న 21 మంది భారతీయ నౌకా సిబ్బంది ఉన్నారు. వీరిని రక్షించేందుకు భారత్ నౌకాదళం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంవీ ఫెయిర్‌చెమ్‌బోగ్ అనే చమురు ఓడ సలాహ్ తీరంలో హైజాక్‌కు గురనట్టు ఆయన తెలిపారు. ఈ సమాచారాన్ని భారతీయ నౌకాదళం, బ్రిటన్ నావికా సంస్థలకు చేరవేసినట్టు డైరక్టరేట్ ఆఫ్ షిప్పింగ్ తెలిపారు.