భారత్‌తో సమస్య కాశ్మీర్ అంశంపైనే: హఫీజ్ సయీద్

భారత్‌తో కాశ్మీర్ అంశం మాత్రమే మాకు సమస్య అని జమాతే ఉద్ దవా (జేయూడీ) ఛీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఆదివారం పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో కూడా తీవ్రవాద దాడులు లేదా ఆత్మాహుతి దాడులకు తమ గ్రూప్ పాల్పడడంలేదని తెలిపాడు.

"మాకు భారత్‌తో ఏదైన సమస్యంటూ ఉంటే అది కాశ్మీర్ సమస్య మాత్రమే. కాశ్మీర్‌పై మేము బహిరంగంగానే మాట్లాడుతాం, భారత్‌ కాశ్మీర్‌ని బలవంతంగా ఆక్రమించుకుంది, ఇది సరైన చర్యగా మేము భావించడం లేదు" అని నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు కూడా అయిన సయీద్ అన్నాడు. జమ్ము, కాశ్మీర్‌లోని స్వాతంత్ర్య పోరాటానికి జేయూడీ మద్దతిస్తుందని సయీద్ తెలిపాడు. ప్రధాన సమస్య కాశ్మీర్, అనంతరం కాశ్మీర్‌లోని నీరు, డ్యామ్స్ ఉన్నాయి అని ఆయన పేర్కొన్నాడు. 2008 ముంబాయి దాడుల వెనుక భారత అధికారుల పాత్ర ఉందని ఆరోపించాడు.

వెబ్దునియా పై చదవండి