భారత్‌‍ కీలక పాత్రకు రష్యా, చైనా మద్దతు

ఐక్యరాజ్యసమితిలో భారత్ కీలకపాత్ర కల్పించేందుకు తాము మద్దతు ఇస్తామని రష్యా, చైనా తెలిపాయి. ఐరాసలో తమకు కీలక పాత్ర కల్పించాలని భారత్ ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఈ ఆకాంక్షకు తాము దన్నుగా ఉంటామని రష్యా, చైనా దేశాధినేతలు హామీ ఇచ్చారు.

భారత్, బ్రెజిల్ దేశాలకు అంతర్జాతీయ వేదికపై సముచిత స్థానం కల్పించాల్సిన, వారి ఆకాంక్షలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా (బీఆర్ఐసీ) దేశాధినేతలు ఇక్కడ జరిగిన తొలి సమావేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశం అనంతరం ఆయా దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఐక్యరాజ్యసమితిలో బహుళపాక్షిక దౌత్యసంబంధాలు, సమగ్ర సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వదేవ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, చైనా అధ్యక్షుడు హు జింటావో తాజా సమావేశంలో ఉద్ఘాటించారు.

వెబ్దునియా పై చదవండి