భారత్ లక్ష్యంగా పాక్ అణ్వాయుధ సంపత్తి

FileFILE
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఇది అటు భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి. ఈ విషయం అమెరికా కాంగ్రెస్ పరిశోధనా సంస్థ సర్వీస్ నిర్వహించిన రహస్య సర్వేలో బహిర్గతమైంది. శత్రుదేశం అణు బాంబును ప్రయోగించిన తర్వాత కూడా నిలదొక్కుకుని తిరిగి దాడిచేసే సామర్థ్యాన్ని పాకిస్థాన్ సమకూర్చుకున్నట్టు ఈ సర్వే వెల్లడించింది.

దీంతో పాక్‌పై దాడి చేయాలంటే ఇతర దేశాలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందేనని ఆ సర్వే పేర్కొంది. అణ్వాయుధాలను భూమిలో దాపెట్టి, వ్యూహాత్మక కేంద్రాల వద్ద రోడ్‌మొబైల్ క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించిందని వెల్లడించింది. ఇంతటి అణు సామర్థ్యాన్ని చైనా నుంచి పాకిస్థాన్ సమకూర్చుకుందని పేర్కొంది.

తొలుత చిన్నపాటి అణ్వాయుధాలు, క్షిపణుల సాంకేతికతను సంపాదించిన పాక్.. దాన్ని ఎన్నోరెట్లకు పెంచుకుందని నివేదిక పేర్కొంది. 1950 నుంచే అణు కార్యక్రమాన్ని చేపట్టినా.. 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అణ్వస్త్రాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టిందని పేర్కొంది. కాగా, పాకిస్థాన్ వద్ద సుమారు 60 అణ్వాయుధాలు ఉన్నట్టు అమెరికా కాంగ్రెస్ నివేదిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి