పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో తమ ప్రమేయాన్ని లష్కరే తోయిబా అగ్రనేతలు జాకీవుర్ రెహమాన్ లఖ్వీ, జారార్ షా అంగీకరించారని సంచలనాత్మక కథనాన్ని వెల్లడించింది. 26/11 దాడుల్లో తమ ప్రమేయాన్ని వీరిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది.
అయితే పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం దీనిని బహిర్గతం చేయాల్సివుందని తెలిపింది. 26/11 దాడులతో లష్కరే తోయిబాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రంగం బలమైన ఆధారాలు గుర్తించిందని వెల్లడించింది. లష్కరే తోయిబానే ఈ దాడులకు వ్యూహరచన చేసిందని, నిధుల సమకూర్చిందని పాకిస్థాన్ దర్యాప్తులో తేలినట్లు డాన్ వార్తా పత్రిక పేర్కొంది.