Atharva Murali, Nimisha Sajayan
అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ డి ఎన్ ఏ చిత్రం క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో మై బేబి పేరుతో జూలై 11న విడుదల కానుంది.