పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై హత్య కేసు నమోదైంది. 2006లో సైనిక చర్య ద్వారా బలూచిస్థాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ బగ్తీని చంపించాడని పోలీసులు ఆయనపై మంగళవారం అభియోగాలు నమోదు చేశారు.
బలూచిస్థాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ బగ్తీ హత్య విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారించిన బలూచిస్థాన్ హైకోర్టు అప్పటి అధ్యక్షుడైన ముషారఫ్‌పై కేసు నమోదుకు గత వారం ఆదేశాలిచ్చింది. దీంతో డేరా బగ్తీ పోలీస్ స్టేషన్లో మాజీ అధ్యక్షునితోపాటు ఆయన అనుచరులపై మంగళవారం కేసు నమోదైంది.
ఇదిలావుండగా ఈ కేసులో నార్త్ వేస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ గవర్నర్ అహ్మద్ ఘనీ, మాజీ ప్రధాని షౌకత్ అజీజ్, మాజీ మంత్రులు అఫ్తాబ్ అహ్మద్, యూసుఫ్ కూడా నిందితులుగా ఉన్నారు.