యువరాజు పెళ్లి ఖర్చు 5 బిలియన్ల బ్రిటిష్ పౌండ్లు..!

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. యువరాజు పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువరాజు- కేథరిన్ మిడిల్ టన్‌ వివాహ వేడుకకు ఐదు బిలియన్ల బ్రిటీష్ పౌండ్లను ఖర్చు పెడుతున్నారని తెలిసింది. భారీగా వెచ్చించి ప్రిన్స్ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది 29న జరిగే ఈ వేడుకకి ఇప్పడే పనులు మొదలయ్యాయి. ప్రఖ్యాత వెస్ట్‌మినిస్టర్ భవనం ప్రిన్స్-కేథరిన్ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 2,220 వీవీఐపీలకే ఆహ్వానం పలికనున్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి