లిబియాకు ఇంటర్‌పోల్ దళాన్ని పంపనున్న ఐరాస

శనివారం, 27 ఆగస్టు 2011 (12:19 IST)
ప్రజాతిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్న లిబియాకు అంతర్జాతీయ పోలీస్ దళాన్ని పంపే ఆలోచనలో ఐక్యరాజ్యసమతి (ఐరాస) ఉన్నది. ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ), యూరోపియన్ యూనియన్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఐరాస ప్రధానకార్యదర్శి ఈ విషయాన్ని చెప్పారు.

లిబియా తిరుగుబాటు ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్‌ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలని కూడా బాన్ పేర్కొన్నారు. తిరుగుబాటుదారులకు చెందిన నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎన్‌టీసీ)ని గుర్తించడానికి ఏయూ నిరాకరిస్తున్నది.

లిబియాకు పంపే పోలీసు బలగాల సంఖ్య చెప్పని బాన్ సెప్టెంబర్ 1న ప్యారీస్‌లో జరిగే అంతర్జాతీయ సమావేశంలో లిబియాపై మరిన్ని చర్చలు జరుపుతామని వెల్లడించారు. బాన్ ప్యారీస్‌లో ఎన్‌టీసీ నాయకుడు ముస్తఫా అబ్దెల్ జలీల్‌తో సమావేశం కానున్నారు. లిబియాకు అత్యవసరంగా ఐరాస మిషన్‌ను పంపాలని భద్రతామండలికి సిఫార్సు చేయనున్నట్లు ఈ ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి