హజారేకు మద్దతుగా నేపాల్‌లో భారతీయుల ర్యాలీ

శుక్రవారం, 26 ఆగస్టు 2011 (09:58 IST)
భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారేకు మద్దతుగా నేపాల్‌లోని వందలాది భారతీయులు గురువారం రాజధాని ఖాడ్మండూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

నేపాల్‌లోని భారత పౌరసంఘాలు నిర్వహించిన ఈ ర్యాలీలో వ్యాపారవేత్తలు, టీచర్లు, కార్మికులు పాల్గొన్నారు. అన్నా హజారేకు మద్దతుగా అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హజారే దీక్షకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

అన్నా హజారే దీక్ష నేటితో పదకొండో రోజుకు చేరింది. భారత పార్లమెంట్ పౌర సమాజం తయారుచేసిన జన్‌లోక్‌పాల్‌పై నేడు చర్చించనుంది. పార్లమెంట్‌లో పార్టీలు బిల్లుపై ఏకాభిప్రాయానికి వస్తేనే తాను దీక్ష విరమిస్తానని హజారే గురువారం స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి