11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొంది. కాగా, గుడౌరీలోని రిసార్ట్‌లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు.
అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.