దేశంలో రోజుకి 110 అత్యాచారాలు: ఇవన్నీ చదువుకున్నవారు చేయరన్న మంత్రి

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:08 IST)
దక్షిణాఫ్రికా మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో దుమారం రేపుతున్నాయి. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకీ పదవికి రాజీనామా చేయాల్సినంతగా చేసిన వ్యాఖ్యలు ఏమిటి? వివరాలు ఇలా వున్నాయి.
 
దక్షిణాఫ్రికా విద్యాశాఖా మంత్రి అంగీ మొషెకా ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా వెళ్లారు. ఆ కార్యక్రమంలో లైంగిక నేరాలు గురించి చెపుతూ.. చదువుకున్నవారు అత్యాచారాలకు పాల్పడరని అన్నారు. అలాంటి దారుణాలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారంటూ చెప్పారు. దక్షిణాఫ్రికాలో సగటున రోజుకి 110 అత్యాచారాలు నమోదు కావడానికి చదువు లేకపోవడమేనన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు.
 
మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలంటూ ధ్వజమెత్తారు. ఐతే ఆ తర్వాత మంత్రి తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. లింగ వివక్ష గురించి మాట్లాడిన సందర్భంలో తను ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. ఐనప్పటికీ మంత్రిపై ఆందోళనలు తగ్గడంలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు