బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లకు తాజాగా నోటీసులు పంపించారు. వీరిలో ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తిలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఊర్వశి రౌతేలాకు పంపిన నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అలాగే, మరో నటి మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి పంపిన నోటీసులో మాత్రం ఈ నెల 15వ తేదీ సోమవారమే విచారణకు రావాలని పేర్కొనడం గమనార్హం. ఇదే కేసు విషయంలో భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ ముమ్మరంగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే.