ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించాల్సివుంది.
మరోవైపు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం, బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.