వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు, అపాయింట్మెంట్లను బుక్ చేసుకునేందుకు, మందుల వాడకం, ఇతర అంశాలపై వైద్యులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, ఈ నౌకలో ఉన్నవారిలో దాదాపు 350 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెల్సిందే.
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్-19 వైరస్ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు.
మరోవైపు, పాన్ తీరంలో నిలిపేసిన 'డైమండ్ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.