దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదులపై జరుగుతున్న ఆపరేషన్‌లో భాగంగా ఆఫ్గనిస్థాన్, అంతర్జాతీయ భద్రతా బలగాలు సంయుక్తంగా కలిసి తాలిబన్లకు చెందిన 23మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఈ నేపథ్యంలో భాగంగా ఓ సైనికుడుకూడా మృతి చెందాడు.
దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదులపై జరుగుతున్న దాడులలో ఆఫ్గనిస్థాన్, అంతర్జాతీయ భద్రతా బలగాలు సంయుక్తంగా కలిసి తాలిబన్లకు చెందిన 23మంది ఉగ్రవాదులను హతమార్చామని ఈ సందర్భంగా ఓ సైనికుడుకూడా మృతి చెందినట్లు ప్రాంతీయ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
గురువారం జరిగిన ఆపరేషన్‌లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు వివరించారు. వీరితోపాటు ఓ సైనికుడుకూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఆఫ్గనిస్థాన్, అంతర్జాతీయ భద్రతా బలగాలు సంయుక్తంగా కలిసి జరిపిన పోరాటంలో తాలిబన్ ఉగ్రవాదులు 16మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాంతీయ ఏజెన్సీ పోలీసు అధికారి మొహమ్మద్ నబీ ఉరూజ్‌గానీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము వారిపై జరిపిన ఆపరేషన్ తర్వాత మృతులను అక్కడే వదిలి వెళ్ళినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో తాము ఆ శవాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని తర్వాత శుక్రవారం కాంధార్‌లో మరో ఆపరేషన్ జరిపామని ఇందులో ఆఫ్గన్ సైన్యం ఏడుగురు తాలిబన్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుండగా తమ సైన్యం జాహరీ జిల్లాలోని ఉగ్రవాదులైన ఏడుగురిని హతమార్చినట్లు ఆఫ్గనిస్థాన్ సైనిక కమాండర్ జనరల్ పీర్ మొహమ్మద్ జాజయీ తెలిపారు. ఆఫ్గనిస్థాన్ ప్రాంతంలో తాలిబన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ తాలిబన్లు అల్‌ఖైదా సంస్థతో కలిసి అమెరికా, పాక్, ఆఫ్గనిస్థాన్ సైన్యం పై పోరాడుతున్నారని ఆయన వివరించారు.