23 ఏళ్ల నిండు గర్భవతిని సజీవ దహనం చేసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. గత యేడాది వారీస్ అలీ అనే యువకుడికి సిద్రా అనే యువతికి పెద్దలు పెళ్లి చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి సమయం దగ్గర పడతున్న ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా ఉద్యోగ రీత్యా వారీస్ సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు. దీంతో అలీ తమ్ముడు వాక్వాస్ ఆ యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తూ వచ్చాడు. వీరి అన్యోన్య జీవితానికి గుర్తుగా సిద్రా గర్భం దాల్చింది.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన అలీ తనకు కాబోయే భార్యను తన తమ్ముడు పెళ్లి చేసుకోవడం, ఆమె గర్భవతి అయిందనే వార్త తెలుసుకుని షాకయ్యాడు. ఇదిలా ఉంటే మరోవైపు అన్నదమ్ముల మధ్య వ్యాపారం బెడిసికొట్టడంతో ఇద్దరి మధ్య వైరం పెరిగింది. దీంతో తమ్ముడు, అతని భార్యపై అలీ కోపం, కసి పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అలీ.. సిద్రా గదిలో ఒంటరిగా నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.