మయన్మార్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను థింగ్యాన్ అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో ఈ వేడుక జరుగుతుంది. అయితే గత ఏడాది ఈ వేడుకలో 272 మంది మరణించగా, ఈ ఏడాది దారుణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి 1,200 క్రిమినల్ కేసులు నమోదైనాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.