అమెరికాలో దారుణం : ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి!

శనివారం, 4 జూన్ 2016 (16:38 IST)
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అమెరికాలోని ఆరిజోనాకు చెందిన ఓ తల్లి (29) తన ముగ్గురు పిల్లల్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపి ఓ గదిలో పడేసింది. ఆ తర్వాత ఆమె కూడా పొడుచుకుని ఆత్మహత్యకు పూనుకుంది. విధులను ముగించుకుని ఇంటికొచ్చిన ఆమె సోదరుడు ఇంట్లో జరిగిన ఘోరం చూసి పోలీసులకు సమచారం అందించాడు. సమాచారం అందుకున్నపోలీసులు ఇంటికొచ్చి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంటిని పూర్తిగా పరిశోధించివన పోలీసులు.. ఇంట్లోని రక్తపు మడుగును చూసి అది ఆమె ఒక్కరిదే కాదని తెలుసుకున్నారు. తీరా మూసి ఉన్న గదిని తెరిచి చూస్తే చిన్నారుల మృతదేహాలు కనిపించింది. కాగా చనిపోయిన చిన్నారుల వయస్సు రెండు నెలలు, 5, 8 సంవత్సరాలు మాత్రమే ఉంటాయని పోలీసులు తెలిపారు. పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఇక మహిళ పొట్ట, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటన వెనుకున్న అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఆమె మానసికస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి