గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారని, డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారని గాజాలోని సివిల్ డిఫెన్స్ తెలిపింది.శుక్రవారం నాడు దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌లో బరాకా కుటుంబానికి చెందిన నివాస గృహాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 10 మంది మరణించారని, బార్బర్‌షాప్‌పై జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళతో సహా మరో ఆరుగురు మరణించారని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు.