5వ తేదీ నుంచి నోబెల్ బహుమతుల వెల్లడి

ఆదివారం, 4 అక్టోబరు 2009 (11:08 IST)
నోబెల్ బహుమతులను సోమవారం నుంచి స్టాక్‌హోమ్‌లో వెల్లడించనున్నారు. ప్రధానంగా ఐదు అంశాల్లో ఈ బహుమతులను వెల్లడిస్తారు. సాహిత్యం, వైద్యం, రసాయన, భౌతిక శాస్త్రాలతో పాటు ప్రపంచ శాంతి విభాగాలలో ఈ బహుమతులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

ముఖ్యంగా గతంలో ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ బహుమతిని అందజేశారు. అయితే, ఇది విమర్శలకు దారి తీయడంతో దీన్ని నోబెల్ పురస్కారంగా భావించడం లేదు. ఫలితంగా సాహిత్యం, వైద్యం, భౌతిక, రసాయన, ప్రపంచ శాంతి విభాగాల్లోనే ఈ బహుమతులను అందజేస్తున్నారు.

ఈ బహుమతి కింద విజేతలు ఒక్కొక్కరికి ప్రశంసాపత్రంతో పాటు 1.4 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు అందజేస్తారు. కాగా, సోమవారం వైద్య విభాగంలో, మంగళవారం ఫిజిక్స్‌ విభాగంలో, బుధవారం కెమిస్ట్రీ విభాగంలో, శుక్రవారం శాంతి విభాగంలో, సోమవారం ఆర్థిక విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి