భూమికి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరం రానుందని పేర్కొంది. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (నియో) ఎర్త్ క్లోజ్ అప్రోచెస్ జాబితాలో పెద్ద గ్రహశకలాలలో ఒకటిగా నిలిచింది. అంతరిక్ష రాయిని 2020 క్యూఎల్-2గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఆస్టరాయిడ్‌ను ప్రమాదకరంగా భావిస్తున్నప్పటికీ.. భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) అంతరిక్ష వనరుల కోసం కొత్త మార్కెట్‌ను సృష్టించే ప్రక్రియను ప్రారంభించింది. చంద్రుడిపై వనరుల అన్వేషణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై సేకరించిన వనరులను కొనుగోలు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. చంద్ర ధూళి, శిలలను తీసుకురాగల సామర్థ్యంగల ప్రైవేట్ సంస్థల కోసం నాసా వెతుకుతోంది.