ఈ నెయిల్ పాలిష్ ధర రూ.1,63,66,000- అందులో ఏముంది?

మంగళవారం, 23 జనవరి 2018 (16:16 IST)
లగ్జరీ లైఫ్ విన్నాం.. లగ్జరీ నెయిల్ పాలిష్ కూడా వచ్చేసింది. గతంలో మోడల్స్ ఓన్ అనే సంస్థ గోల్డ్ రష్ నెయిల్ పాలిష్ వాడుకలో వున్నది. ఆ రికార్డును ప్రస్తుతం 267 కేర‌ట్ల న‌లుపు రంగు వ‌జ్రాల‌ను మేళవించి తయారు చేసిన బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను తయారు చేశారు. ఈ వజ్రాల నెయిల్ పాలిష్‌ను వచ్చే నెల నుంచి విక్రయానికి వుంచనున్నారు. 
 
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గోళ్ల రంగును లాస్ ఏంజెలీస్‌కు చెందిన అజాట్యూర్ అనే సంస్థ తయారుచేసింది. దీని ధర అక్షరాల 250,000 డాల‌ర్లు. అంటే రూ. 1,63,66,000. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్‌ పాలిష్‌ను కేవ‌లం ఒకే ఒక్క బాటిల్‌ను మాత్రమే త‌యారు చేసిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ ఒక్క బాటిల్‌ను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్ట‌నున్నారు.
 
గతంలో తయారైన గోల్డ్ ర‌ష్ నెయిల్ పాలిష్ ధ‌ర 130,000 డాల‌ర్లు .. అంటే రూ. 83 ల‌క్ష‌లు. దీనిని అధికమించి మార్కెట్లోకి రానున్న బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను ఎవరు కొంటారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు