భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

శనివారం, 5 నవంబరు 2016 (10:16 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. భారత్‌ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ పగతో రగిలిపోతూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది. 
 
సరిహద్దులో 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అలాగే, భారీగా ఆయుధాలను తరలిస్తోంది. వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. 
 
ఇదిలావుండగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ మరోమారు చొచ్చుకునిపోయి... సరిహద్దుల వెంబడి ఉన్న పాక్ చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 20 మంది పాక్ జవాన్లు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, పాక్ చేస్తున్న సన్నాహకాలపై భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే రీతిలో దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. కోలుకోలేని రీతిలో పాక్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. ఈ క్రమంలో, సరిహద్దు వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి