భారత్ సాహసం : సురక్షితంగా పౌరులను తీసుకొచ్చిన కేంద్రం

మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:32 IST)
భారత ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. తాలిబన్ ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకుని పోయిన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసి.. 120 మంది అధికారులను భారత్‌కు తరలించారు. 
 
కాబూల్ నుంచి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన సీ -17 యుద్ధ విమానం గుజరాత్‌లోని… జామ్‌నగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో మొత్తం 120 మంది భారతీయ అధికారులను తీసుకొచ్చారు. వారిలో చాలా మంది అక్కడి భారత రాయబార కార్యాలయంలో పని చేసేవారు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రమే వారంతా కాబూల్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అమెరికా భద్రత సహకారంతో అప్ఘనిస్తాన్‌లో భారత రాయబారి, ఇతర ఉద్యోగులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించారు. అక్కడి నుంచి వారు సురక్షితంగా భారత్ తీసుకొచ్చారు. కాబూల్‌లోని ఎంబసీ ఉద్యోగులంతా సేఫ్‌గా దేశానికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు