మరోవైపు, ఆప్ఘాన్‌లో పరిస్థితులు చేయిదాటిపోవడంతో కాబూల్‌లోని ఎంబసీని భారత్ ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్‌కు అత్యవసరంగా పంపించారు. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్‌లోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను స్వదేశానికి తీసుకునిరానున్నారు.
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిదమ్ బగ్చి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆప్ఘాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మన రాయబారితో పాటు ఎంబసీ మొత్తం సిబ్బందిని తక్షణమే స్వదేశానికి రప్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఆప్ఘన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్స్‌లైన్ నంబర్ 919717785379ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.