సుమారు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ గగనతలం మూసివేయడానికి ముందు, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రేనియన్ రాజధాని కైవ్‌కు ఒక విమానాన్ని నిర్వహించింది.
ఈ విమానం 240 మందిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది. అలాగే ఫిబ్రవరి 24, 26న మరో రెండు విమానాలను నడపాలని భారత్ యోచించింది, కానీ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యన్ దాడి ప్రారంభమైన సంగతి తెలిసిందే.