ముఖ్యంగా ఉగ్రవాదులను అణచివేయడంలో పాకిస్థాన్‌లోని అత్యంత బలమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. అవసరమైతే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై ఒంటరిగా దాడి చేయడానికి సందేహించేది లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్‌ను నిరోధించే శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆదంమ్ జుబిన్ ఈ హెచ్చరిక చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వంలోనూ, ముఖ్యంగా ఐఎస్ఐలోనూ బలమైన శక్తులు పాకిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలపై ఒకే విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటుండటమే ప్రధాన సమస్య అన్నారు. కొన్నిఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను సహిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను వెంటాడాలని పాకిస్థాన్‌లోని అమెరికా భాగస్వాములను కోరడం కొనసాగిస్తామన్నారు.