ALSicebucketchallenge ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆంటోని సెనెర్చియా ఇక లేరు. అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలోరొసిస్ అనే వ్యాధితో సుమారు 14 ఏళ్లుగా పోరాడి ఓడిపోయాడు. నవంబరు 28న కన్నుమూశాడు. ఈ జబ్బు గురించి అవగాహన పెంచేందుకు, దీనిపై విరివిగా పరిశోధన జరిగాలని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆయన ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. జబ్బు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలనీ, ఇతరులకు ఆ వ్యాధి పట్ల అవగాహన కల్గించాలని ఆంటోని చెప్పేవారు. 2003లో ఆయనకు ఈ వ్యాధి సోకింది.