పాక్ సైన్యం పైశాచికత్వం.. భారత సైనికులను చంపి ముక్కలుగా నరికి....

ఆదివారం, 24 డిశెంబరు 2017 (14:24 IST)
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం పైశాచికంగా ప్రవర్తిస్తోంది. తాజాగా సరిహద్దులో నలుగురు భారత సైనికులను పాక్‌ సైన్యం బలి తీసుకుంది. వీరిని చంపాక చేసిన పైశాచిక చేష్టల గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బయటపడ్డ మరో జవాన్‌ అందించిన వివరాల ప్రకారం వర్ణించలేని రీతిలో వారిని పాక్‌ ఆర్మీ హింసించిందని చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టరు వద్ద నలుగురు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతలో ఊహించని రీతిలో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) వారివైపు దూసుకొచ్చింది. వారి వెంట కొందరు ఉగ్రవాదులు కూడా ఉన్నారంట. సుమారు 400 మీటర్ల సరిహద్దు దాటేసిన పాక్‌ సైన్యం వారిని బందీలుగా చేసుకుంది. ఆపై చిత్ర హింసలకు గురి చేసి హతమార్చింది. ఇక వారిని చంపాక దాష్టీకానికి పాల్పడింది. వారి మృతదేహాలను ముక్కలుగా నరికినట్లు వెల్లడించారు. 
 
చనిపోయిన వారిలో మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్ (32), లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్ (34), లాన్స్ నాయక్ కులదీప్ సింగ్ (30), సిపాయి పర్ గత్ సింగ్ (30)లు ఉన్నారు. మరో జవాను తీవ్ర గాయాలతో తప్పించుకోగా, అతనికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత పాక్ సైనిక పోస్టులపై భారత్ భారీ ఎత్తున ప్రతిదాడులకు దిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు