ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

బుధవారం, 22 జూన్ 2022 (12:40 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ 6.1గా నమోదైంది. ఈ భూకంపంతో సుమారు 155 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడినట్టుగా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
 
సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది.. ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్‌లలో చేరుకుంటున్నారు. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైందని సమాచారం. భూకంపం సంభవించిన ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు