ప్రమాదం జరిగిన సమయంలో నదిలో నీటి ప్రహావం ఉధృతంగా ఉండటంతో తక్షణం సహాయక చర్యలను చేపట్టలేకపోయారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉంది. జలసమాధి అయిన 71 మందిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.