విదేశీ వైద్యుల వలసల కార్యక్రమంతో ఆస్ట్రేలియాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా శిక్షణ పొందిన వైద్యుల కొరత ఏర్పడిందని, అందువల్ల విదేశీ వైద్యుల వలసలను నిలిపివేయాలని ఆ దేశ మెడికల్ కమ్యూనిటీ సీనియర్ సభ్యుడు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా దేశ వైద్యశాఖ వ్యక్తం చేస్తూ.. ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, విదేశీ వైద్యుల వలసలపై నిషేధాన్ని ఆస్ట్రేలియన్ మెడికల్ అసోసియేషన్, గ్రామీణ వైద్యుల సంఘాలు స్వాగతించాయి. ఈ ఏడాది మార్చి నాటికి 2,155 మంది జనరల్ ప్రాక్టీషనర్లు, 1562 మంది రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు విదేశాల నుంచి ఆస్ట్రేలియాకు వీసాపై వచ్చారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.