మృతదేహం నుంచి సజీవంగా బయటకు వచ్చిన పాము..?!

శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:59 IST)
మృతదేహం నుంచి సజీవంగా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శవపరీక్ష సందర్భంగా అమెరికాలో మరణించిన వ్యక్తి తొడ నుంచి సజీవంగా పాము బయటకు వచ్చింది. జెస్సికా లోగన్ అనే 31 ఏళ్ల మహిళ అమెరికాలోని ఓ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసే వ్యక్తిగా (Autopsy technician)పనిచేస్తోంది. తొమ్మిదేళ్లుగా ఉద్యోగంలో ఉన్న జెస్సికా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకుంది.
 
"ఒకసారి, నేను మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నాను. అప్పుడు ఆ శరీరం నుండి ఒక పాము సజీవంగా రావడం చూశాను. మనిషి తొడలోంచి పాము రావడం చూసి కేకలు వేస్తూ బయటకు పరుగెత్తాను. సిబ్బంది పామును పట్టుకుని తొలగించిన తర్వాతే మళ్లీ పని ప్రారంభించాను.
 
మృతదేహం వాగు సమీపంలో కుళ్లిపోయి కనిపించింది. పాము శరీరంలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలు ఎక్కడ మరియు ఏ స్థితిలో దొరుకుతాయనే దానిపై ఆధారపడి, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి... అంటూ చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు