పాక్ పట్ల మోదీ వైఖరిపై భారత్ ప్రజలు అసంతృప్తి... సైనిక చర్యే ఉత్తమం... అమెరిక‌న్ స‌ర్వేలో సుస్ప‌ష్టం

మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:33 IST)
వాషింగ్టన్: ఉగ్రవాదం అణచివేతకు సైనిక శక్తి వినియోగం సరైందని ఐదింట మూడింతలకు పైగా భారతీయులు తెలిపారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. చాలామంది పాక్‌పై మోదీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌కు ఐసిస్ ప్రధాన ముప్పు కానుందని 52 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఓడించేందుకు సైనిక శక్తిని ఉపయోగించడం ఉత్తమమని 62 శాతం మంది చెప్పారు. పాక్ పట్ల మోదీ విదేశాంగ విధానాన్ని 22 శాతమే ఆమోదించగా... రక్షణ రంగంలో మరింత ఖర్చు పెట్టాలని చాలామంది చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 24 మధ్యలో మొత్తం 2,464 మందిని సర్వే చేశారు. అత్య‌ధికులు ఇక సైనిక చ‌ర్యే ఉత్త‌మ‌మ‌ని తేల్చారు.

వెబ్దునియా పై చదవండి