బ్రిటన్ రాజధాని లండన్‌లోని అండర్‌గ్రౌండ్ రైల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పశ్చిమ లండన్‌లోని పార్సన్స్ గ్రీన్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులతోపాటు అంబులెన్స్, పారామెడికోలు వెళ్లారు.
రైలు వెనుకభాగంలో ఉన్న కంటైనర్‌లో ఈ పేలుడు జరిగింది. దీంతో వెంటనే అండర్‌గ్రౌండ్ ట్యూబ్ నుంచి ప్రయాణికులను పంపించేశారు. దీనిపై ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ స్పందిస్తూ, ఎర్ల్స్ కోర్ట్, వింబుల్డన్ మధ్య సర్వీసులను రద్దుచేసినట్లు తెలిపింది.
అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లండన్ భూగర్భ రైలులోకి బాంబులు ఎలా చేరాయన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొత్తం రెండు బాబులను అమర్చగా, వాటిలో ఒకటి పేలింది. మరో బాంబును భద్రతా సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రాణనష్టం తప్పింది.