విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

ఠాగూర్

శుక్రవారం, 25 జులై 2025 (09:15 IST)
విమానం ఒకటి గగనతలంలో అమితవేగంతో దూసుకుని వెళుతుండగా ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతని మృతదేహం అదృశ్యమైపోయింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 13వ తేదీన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టీకే79 విమానం ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. అయితే, విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన చనిపోయాడు. దాంతో ఫ్లైట్‌ను ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్ విమానాశ్రయానికి మళ్లించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో విమానాన్ని షికాగో ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 
 
మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్టు సమాచారం. అలాగే మిగిలిన ప్రయాణికుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు. అయితే, టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం అందలేదని ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ పేర్కొనడం గమనార్హం. దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు