కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. జరిమానాకు బదులు ముద్దు.. అధికారి సస్పెండ్

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (17:42 IST)
Lip Lock
కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఓ మహిళపై చర్యలు తీసుకోవాల్సిన ఓ అధికారి జరిమానాకు బదులు ఆమెకు ముద్దు పెట్టి సస్పెండ్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పెరూ రాజధాని లిమాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఓ మహిళను పోలీస్‌ అధికారి అడ్డుకున్నారు. 
 
అయితే, ఫైన్‌ నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ మహిళ అతడికి చాలా దగ్గరిగా వెళ్లింది. ఫైన్‌కు బదులు అతడిని ముద్దుకు ఒప్పించేందుకు యత్నించింది. ఈ క్రమంలో తొలుత అతడు నిరాకరించినా ఆ తర్వాత కొద్ది సెకెన్లలోనే మనసు మార్చుకొని ఆమెను ముద్దు పెట్టుకోవడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 
 
ఈ వీడియో వైరల్‌ కావడంతో మిరాఫ్లోర్స్‌ మేయర్‌ లూయిస్‌ మొలినా దృష్టికి వెళ్లింది. దీంతో అతడి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మేయర్‌.. ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారని సిటిజన్‌ సెక్యూరిటీ ఇంఛార్జి ఐబెరో రాడ్‌గ్రూయిజ్‌ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు